Dec
18

Cold water bath in Bangalore winter


సలే శీతాకాలం అపైన చన్నీల్లు ... చి.కా.కో

నేను అయ్యప్ప మాల వేసుకున్నాను కదా, ఒక విదం గా చెప్పాలి అంటే అయ్యప్ప దీక్ష నా చిరకాల కోరిక(చి.కా.కో) అనాలి(ఓహో చి.కా.కో అంటే ఇదా !! ఇంకా చికాకు రాయబోయి అచ్చు తప్పు వేసారెమో అనుకున్నా. వాకే అయితే).ఇది అసలే నవంబరు మాసం, చలి దాని రెంజి లొ అది చల రేగి పొతుంది, మరి వీడెవడండి బాబు!! (అవును నేను బాబు నే)

ఈ కాలం లొ జనాలంతా "అమెరికా వెల్లాలి-అదర గొట్టాలి", "చందమామ ఎక్కాలి - చల్లగా తిరగాలి" అంటుంటె ఈ మనిషి (కాదు ఇప్పుడు స్వామి కదా!)ఎమిటి "శీతాకాలం చన్నీల్లు పొసుకుంటాను అంటారు పైగా బెంగులూరు లో ఉంటూ" అనుకుంటున్నార ???

 సహజం మనిషి అన్న వాల్లకి వచ్ఛె ప్రశ్నె ... "(ఒక్క)ఒక్కో మగాడు, ఒక మాదిరి" అన్నాడు మొన్న మా ఫ్రెండు ఒకడు - అది లక్ష శాతం అక్షర సత్యం. ఎందుకంటే ఇది నా చి.కా.కో కాబట్టి ..కష్టం అయినా ఇష్టం తో చెస్తున్నా కాబట్టి కమ్మ గానే ఉంటుంది.


మాములు గా శీతాకాలం అంటే అంతా చలా బద్దకం గా ఉంటుంది, కానీ అయ్యప్ప పేరున నాకు ఈ శీసన్ అంతా రెట్టింపు ఉత్సాహం గా గడిచింది.(అసలే శీతాకలం ఆ పైన చన్నీల్లు వల్ల కామోను.. ).ఈ ఫీలింగ్ నా మటల్లో కంటే మీరు ఒక్కసారి అనుభవిస్తే బాగుంటుందెమో !

ఎవరయినా అమెరికా గురించి వింటెనో, అక్కడి నుండి వచిన వాల్లని చూస్తేనో అక్కడికి వెల్లాలి అనుకొవటం లేక పోతే మర్కెట్ లో కొత్త గా వచ్చిన కారుచూసినప్పుడు దాన్ని తోలాలి అని అనిపించటమో సహజమే, కాని అయ్యప్ప దీక్ష ఎంటి ? అసలు ఈ చి.కా.కో ఎంటి రా బాబూ ?? అని అలోచిస్తున్నరా ! అక్కడి కే వస్తున్నాను ... "గోకితే గాని దురద - తీరితే గాని కోరిక " కుదురు గా కూర్చో నివ్వవు సుమీ ! నా చిన్నతనం లొ మా నాన్న ఇంకా వాళ్ళ తమ్ముల్లు(అంటె నా బాబాయి లె కదా!!! అంత పొగరే ? మాములు గా చెప్పొచు గా!) వరస పెట్టి అంతా శీతాకాలం వచ్చిందంటే చాలు అయ్యప్ప దీక్ష లొ ఉండె వాల్లు, రోజు వాల్లని చుస్స్తూ ఎదొ క్రేజీ గా ఫీల్ అయ్యాను అనుకుంట అందుకే మనసులొ ఇది ఒక చి కా కు గా తయారు అయ్యింది అనుకుంట...(చికాకు కాదండి ! చి.కా.కో - పెద్ద తేడా ఎమీ లెదు అనకండే ).చినప్పుడు అసలు అంత క్రేజీ గా ఎందుకు ఫీల్ అయ్యాను సుమీ ? మద్యలో ఈ సుమ ఎవరు బాబూ ??? (బాగుంటుందా అని అలోచిస్తున్నరా!!)


మాల/ దీక్ష లో ఉంటే అంతా స్వాములని చాలా కొత్త గా, గౌరవం గా చూసే వాల్లు, అంతా స్వామి అని పిలవటం, రోజు నల్ల దుస్తులు వేసుకోవటం ఇంకా ప్రతి రోజు ఎదో ఒక పుణ్య క్షెత్రానికి వెల్లటం, వాల్ల్లకి అన్నీ స్పెషల్ గా వండి పెట్టటం అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్పెషల్స్ ఉండేవి.

ఒక్క మాట లో చెప్పాలి అంటే దేవుడి తో సమానం గా చూస్తూ కనపడిన ప్రతి చోటా వంగి వంగి దణ్ణాలు కూడా పెట్టె వాల్లు .

అన్ని స్పెషల్స్ ఒక్కరి దగ్గరే ఉంటే క్రెజీ గా ఫీల్ అవ్వటం సహజం కదండి.అందుకే గామోలు నేను చేయాలి అని నిర్దారించుకున్నట్టు ఉన్నా మనసులో, ఇంకా అలా ఏదయినా మనసులో ఉంటే మాటలా మరి, అది కలవర పెట్టకుండా ఉంటుందా ... ఇక సమయం కోసం 15 సంవత్సరాలు గా చూసి చూసి, ఆ భగవంతుడి అనుమతి తో 2008 లొనే పూర్తి చెయాలి అన్న సంకల్పం తో ఎవరూ తోడూ లేక పొయినా ఊరు కాని ఊరు లో(బెంగులూరు ఊరే కధా!! అంటే మన ఊరు కానివన్నీ అలా అనాలని పిస్తుందెమో ...అబ్బో దీని గురించి ఆలొచిస్తూ ఉంటే ఇంకో టపా రయ్యొచు), తొందరపడుతూనే నిసితం గా అన్ని తెలుసుకుని నే మొదలు పెట్టెసా.


ఇక్కడ నేను పరిగణ లోకి తీసుకొవలసిన ముఖ్యాంశాలు రెండు మొత్తానికే మరిచాను, అవి ఎమిటి అంటే ? నేను ఉంటున్న ప్లేసు, నాతో ఉంటున్న పెర్సన్స్.నేను ఉండేది బెంగలూరు కావటం తో ఉదయ్యాన్నే నిద్ర లేచి చన్నిట్టి స్నానం చెయాలి అన్న ముఖ్య నియం మరిచాను. ఇంకా నాతో ఉండే తోటి సహచరులకి ఇబ్బంది ఎమో అని అలోచించలెదు. కాని ఇవ్వన్ని భగవంతుడు నిర్ణయం చెశి నాకు నిర్దేసించినట్టు అన్ని వాటంతట అవే సహజం గా సర్దుకున్నాయి. అసలే శీతాకాలం అపైన చన్నీల్లు , మొదటి రోజు మొదటి చంబు తో నెత్తిన నీల్లు పొయగానె వెంటనే ఆ దెవుడే గుర్తు వచ్హాడు, కాని

ఇక్కడ చన్నిల్ల కి ఒక చిట్కా ఉంది, బయట చలి గా ఉండతం తో మన శరీర ఉష్నోగ్రత దాని కి తగ్గట్టు గా మారి మనల్ని చలి కి తట్టుకొనెలా ఉంచుతుంది. కాని మనలో చన్నీల్లు ... అని యెళ్ళ తరబడి మదిలో ముద్రించుకున్న భావన ఒక్క సారి తడవగానె చెరిగి పోతుంది అంటే నమ్మండి.

మొత్తానికి దీక్ష లో మొదటి పరీక్ష భెషుగ్గా పాస్ అయిపొయా !



నాకు తదుపరి పరీక్ష, "తలగడ లెకుండా పడుకోవటం", పడుకునేది తుంగ చాపయినా గాని తల కింద తలగడ లేకుండా పడుకోవటం మాత్రం అంత సులువు ఎమీ కాదు స్వామీ . ఇది అలవాటవటానికి కొంచం కష్ట పడ్డాను గాని , ఇది నాకు భవిష్యత్తు లో బాగా ఉపయొగపడబోయె అలవాటే, కాబట్టి ఆనందమే! ఇంక నెను ఎక్కడయినా, ఎలగయినా హాయి గా తలగడ లేకుండా కూడా నిద్ర పోగలను.


ఆకరుది అసలుదీ ఏమిటంటే అది -భిక్ష (స్వాములు బుజించే దాన్నే భిక్ష అంటారు లెండి). బ్రహ్మచారి కి మంచి నేస్తం వంట అని నా ఉద్దెశ్యం,

ఇ బ్లాగింగు అలవాటు కు ముందు నన్ను ఒంటరితనం నుంచీ అతి ఎక్కువ సార్లు కాపాడింది అంటే అది నా స్నెహితులు ఇంకా "వంట".

ఇతవరకు అయ్తే మాములు వంటే అతి జాగర్త గా కావలిసినవి అక్కర్లెనివీ అన్ని వేసి చేసినా ఎదో కొత్త గా (చెత్త గా) వచేవి, అదెమిటో తేలీదు ఈ నలబై రోజులు నేను ఏది చెసినా ఒక అద్బుతమంటే నమ్మండి . మాములు రోజులలో ఊల్లి, అల్లం , ఆలు , ఇలాంటివి అన్ని వాడి కూడా రాని పదార్దాలు చిటెకలో ఎమి వెయకుండానె రుచి కరం గా తయారు అయ్యెవి. బహుసా స్వాములు తినేది ప్రసాదం తో సమానం కాబట్టి అలా అన్ని అద్బుతం గా కుదిరేవేమో ?

పక్క ఇంట్లో ఉన్న నార్థ్ ఇండియన్స్ "ఊ సురూర్.." అంటూ ఇమేష్ రేషమ్యా పాటలు పెట్టినా , అది కూడా "ఓం శరణం అయ్యప్ప" అన్నట్టు వినపడేది.

కీరవాణి బాణి("అంతా రామమయం ..") లా చెప్పాలి అంటే నాకు అంతా భక్తి మయం. ఇది ఒక అద్భుతమయిన ఫీలింగ్.ఎవరితోను ఎక్కువ గా మట్లాడకుండా, ఖ్షుద్బాద కి సరిపడా మాత్రమే బొంచేస్తూ, రెండు పూటలా చన్నిటి స్నానం చేస్తూ మనకి మనమే ఒక్క కొత్త దనం తో కనపడుతూ , మనకి మన మీద మనుకున్న నమ్మకం మునుపెన్నడూ లేనంత / తెలియనంత నింపుతూ , ప్రపంచం లోని ప్రతి ప్రాణి లోనూ భగవంతుడి నే చూస్తూ , మనలోని చెడు ని దూరం చేస్తూ సాగిన ఈ నలబయి రొజూలు, నిజం గా నా జీవితానికి ఒక మైలు రాయి.
రాబొయె కొత్త సంవత్సరం-2009 లో కూడా నాలో వచ్హిన ఈ కొత్త మర్పులు ఇలాగే కొనసాగించాలి అనుకుంటూ, ఆ భగవంతుడి ని ప్రాదిస్తాను.

ఇక పొతే నా సహచరుడు సహజం గానే సహనశీలి, కావున ఇక నాకు ఏ ఇబ్బంది లేకుండా దిగ్విజయం గా ఈ దీక్ష ని పూర్తి చెయగలిగాను. ఎలాగయితే నేమి ?మొత్తానికి నా చి.కా.కో దాని చికాకు అన్ని తీరబొతున్నాయి.మూడు రోజుల నా "శబరిమల యాత్ర" పూర్తి కాగానే యాత్రా విశేషాలతో ఇంకా నా అనుభవాలు, అనుభూతులు మీతో పంచుకుంటూ మళ్ళి ఇక్కడే కలుస్తాను ఈ రొజు కి శెలవు మరి. ఈ లోపు మీరు ఇక్కడ నా పాత టపా లు అన్న్ని చదివి మీ అభిప్రాయల్ని రాయండి. 

Related posts :


2 comments to "Cold water bath in Bangalore winter"

  • Very nice swami. Excellent narration. Keep up the good faith in Swami, he will be there with you always. Swami Saranam.

  • swamiye saranam ayyappa. Swamy, I am doing ayyappa deekhsha for the first time. I am feeling the same thing which you have mentioned. I found a newer me. Very nice to see this post.



Post a Comment

Whoever writes Inappropriate/Vulgar comments to context, generally want to be anonymous …So I hope U r not the one like that?
For lazy logs, u can at least use Name/URL option which doesn’t even require any sign-in, The good thing is that it can accept your lovely nick name also and the URL is not mandatory too.
Thanks for your patience
~Krishna(I love "Transparency")

Popular Posts

Enter your email address:

Buffs ...

Tags

ANT Automations Awards Banks Batch file Data Structures Database DB2 Devotional Downloads ETV Dhee Feel Fun Games HTML India Java JBOSS Jython Kafka MicroServices Microsoft Mobile Stuff Movies My SQL Networking Oracle Politics Protocols Python Readers choice Reviews Shell Scripting Solaris Springboot Technical Telangana Telugu Tips Travelogues UNIX Web Server Websphere Windows
Powered by WidgetsForFree

Archives